టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతం కూడా వీరు అదిరిపోయే క్రేజ్ కలిగిన హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో కంటిన్యూ అవుతున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఒకే ఫార్ములాను ఫాలో అయ్యి పోయిన సంవత్సరం సంక్రాంతి పండక్కు నాగార్జున విజయాన్ని అందుకుంటే , ఈ సంవత్సరం వెంకటేష్ విజయాన్ని అందుకున్నాడు. ఆ ఫార్ములా ఏమిటి అనేది తెలుసుకుందాం.

పోయిన సంవత్సరం నాగార్జున "నా సామి రంగ" అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి పండక్కు చాలా తక్కువ రోజుల ముందు మొదలు పెట్టి ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురాబోతున్నాం అని ప్రకటించారు. దానితో ఇంత తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఈ మూవీ సంక్రాంతికి విడుదల కావడం కష్టం అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ముందు చెప్పిన విధంగానే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని అందుకున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ను కూడా సంక్రాంతికి చాలా తక్కువ రోజుల ముందు మొదలు పెట్టారు. దానితో ఈ మూవీ కూడా సంక్రాంతికి రావడం కష్టమే అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. కానీ అనిల్ రావిపూడిసినిమా షూటింగ్ను పక్కా ప్రణాళికతో పూర్తి చేసి ముందు చెప్పిన విధంగా సంక్రాంతికి తీసుకువచ్చాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా ఒకే ఫార్ములాతో పోయిన సంవత్సరం నాగార్జున "నా సామి రంగ" సినిమాతో విజయాన్ని అందుకుంటే , ఈ సంవత్సరం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: