చాలామంది హీరోయిన్లు సినిమాల్లో ఫేమస్ అవుతున్న సమయంలోనే మరిన్ని సినిమాల్లో అవకాశాల కోసం హాట్ హాట్ గ్లామర్ పాత్రలతో పాటు రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించడానికి సై అంటారు. అయితే అప్పట్లో నటి ప్రియమణి కూడా ముందు పద్ధతి గల పాత్రల్లో నటించి ఆ తర్వాత హాట్ గా నటించడంతో ప్రియమణి ని చూసి అందరూ షాక్ అయ్యారు.అయితే బాలకృష్ణ నాగార్జున ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో  ప్రియమణి పద్ధతి గల పాత్రలే చేసింది. కానీ ఆ కుర్ర హీరో కోసం మాత్రం బికినీ ధరించి ఇండస్ట్రీలో రచ్చకు తెరలేపింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నితిన్ హీరోగా చేసిన ద్రోణా మూవీలో ప్రియమణి హీరోయిన్గా చేసింది.ఈ మూవీలో ప్రియమణి బికినీలో కనిపిస్తుంది.

 అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రియమణి బికినీ ధరించిన ఫోటోలు మీడియాకు లీక్ చేయడంతో అవి కాస్త రచ్చకు దారి తీసాయి.దాంతో ఈ ఫోటోలపై ప్రియమణి తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిందని,వెంటనే ఫొటోస్ డిలీట్ చేయమందని,అలాగే తనని బికినీలో చూపించినందుకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా ఇవ్వమని అడిగి నిర్మాతతో గొడవలు పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి.అయితే నిర్మాతతో గొడవలు బికినీ వేసుకోవడం గురించి ప్రియమణి గురించి వచ్చిన వార్తలపై  నిర్మాత డిఎస్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 

ప్రియమణి బికినీ వేసుకోవడానికి నిర్మాతతో గొడవ పెట్టుకుందని రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. అయితే బికినీ సన్నివేశం గురించి ప్రియమణికి మొదట మేము చెప్పలేదు. మూవీ 80% షూటింగ్ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ బికినీలో సాంగ్ షూట్ ఉంటుందని చెప్పడంతో మొదట ప్రియమణి సైలెంట్ అయ్యి క్యారవాన్ లోకి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని చెప్పి ఆ తర్వాత వచ్చి ఓకే చేసింది.అయితే ప్రియమణికి సంబంధించిన బికినీ ఫొటోస్ కూడా సినిమాపై హైప్ ఉంటుందని మేమే రిలీజ్ చేసాం. అలాగే ప్రియమణి బికినీ వల్ల మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి..అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: