
అయితే ఇప్పుడు ఈ సినిమాని నాని తన సొంతంగా నిర్మించడం మరో సర్ప్రైసింగ్ అని చెప్పవచ్చు .. చిరంజీవి స్ఫూర్తితో హీరోగా మారిన నాని ఆయన్ను ప్రొడ్యూస్ చేసే స్థాయికి రావటం అనేది ఎంతో గొప్ప విషయం . శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా కంప్లీట్ అవ్వగానే చిరు సినిమా ఉంటుందని తెలుస్తుంది .. గతంలో నాని శ్రీకాంత్ కలిసి చేసిన దసరా బాక్సాఫీ దగ్గర భారీ విజయం అందుకుగా ఇప్పుడు ఆ సినిమాను మించేలా పారడైజ్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అయితే చిరుతో శ్రీకాంత్ ఓదల చేస్తున్న సినిమాలో ఎన్నో సురప్రైజ్లు ఉంటాయని తెలుస్తుంది .. ప్రధానంగా ఈ సినిమాలో నాని కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది ..
శ్రీకాంత్ ఓదెల కథ చెప్పినప్పుడే నాని కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తాడని చిరంజీవికి చెప్పి ఒప్పించారట .. అయితే ఇది చిరంజీవి - నాని మల్టీస్టారర్ సినిమా అవ్వచ్చు అని కూడా అంటున్నారు . ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా ఉంటుంది .. అయితే అనిల్ సినిమా మళ్లీ వచ్చే సంక్రాంతికి రాబోతుంది.. మరి ఈ లోగా ఏం చేస్తారన్నది చూడాలి .. అనిల్ చిరంజీవి సినిమా కంప్లీట్ అవ్వగానే శ్రీకాంత్ ఓదేల సినిమా ఉండే అవకాశం ఉంది .. మరి ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తారు.. ఈ మెగా మూవీలో నాని రోల్ ఏంటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.