అల్లు అర్జున్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పాన్ ఇండియా హీరో పేరు మారు మ్రోగిపోతుంది . దానికి కారణం పుష్ప2 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప  రైజ్ తో ఒక విజయం అందుకున్న  అల్లు అర్జున్ పుష్ప2  ది రూల్ తో మాత్రం సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు గ్లోబల్ వైడ్ తన పేరు  మారుమ్రోగి పోయేలా చేసుకున్నాడు . అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రత్యేక రికార్డులు ప్రత్యేక గుర్తింపు కూడా సొంతం చేసుకుంటున్నారు .  రీసెంట్ గానే అల్లు అర్జున్ రేర్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు . ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్..ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే పేరుతో ఇండియాలోనూ అడుగు పెట్టింది .


మరీ ముఖ్యంగా ఈ మ్యాగజైన్ తొలి సంచిక కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో రావడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఈ కవర్ పేజ్ ఫోటోషూట్ ను నిర్వహించారు టీం. ఆ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.."ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.  బలం - ఆత్మవిశ్వాసం మనలో ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు . వాటిని ఎవరు తీసేయలేరు కూడా ..కొన్ని లక్షణాలు మనకు పుట్టుకతోనే వస్తాయి . ఇది కూడా అలాంటిదే..



విజయం తర్వాత కూడా వినయంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ . జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలామందిని నేను చూశాను . వాళ్లే నాకు ఇన్స్పిరేషన్ .అది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది . నేను ఇప్పటికీ ఎప్పటికీ 100% సామాన్యుడిని అంటూ అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు".  అయితే చాలామంది పుష్ప2 సినిమా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ కి హెడ్ వెయిట్ పెరిగిపోయింది అంటూ కామెంట్ చేశారు . పలువురు పెద్దమనుషుల పలు మీడియా ఫంక్షన్ లోనూ ఇదేవిధంగా మాట్లాడారు . అయితే అల్లు అర్జున్ అదంతా ఫేక్ అని నేను ఎప్పుడు సామాన్యుడిగానే ఉన్నాను అంటూ చెప్పుకో రావడం ఇప్పుడు ఫ్యాన్స్ ఆ వీడియోను ట్రెండ్ చేయడం మరొకసారి హైలెట్గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: