ఎంతో మంది తెలుగు దర్శకులు హిందీ లో సినిమాలను రూపొందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ తెలుగు లో సక్సెస్ అయిన దర్శకులు హిందీ లో సినిమాలు తీసి అక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సందర్భాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఇద్దరు దర్శకులు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి అక్కడ మాత్రం ఫెయిల్యూర్ ను అందుకున్నారు. వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శైలేష్ కొలను ఒకరు. ఈయన విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఇదే టైటిల్ తో శిలేష్ హిందీ లో రీమేక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం జెర్సీ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను జెర్సీ అనే టైట్ తో హిందీ లో గౌతమ్ రీమేక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అలా అప్పటికే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ ఇద్దరు దర్శకులు తాము తెలుగులో రూపొందించే హిట్ కొట్టిన సినిమాలను హిందీ లో రీమేక్ చేసినా కూడా వీరికి అక్కడ మాత్రం విజయాలు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: