
మహేష్ లాంటి అగ్ర హీరో దొరికితే భారీ విధ్వంశాన్ని క్రియేట్ చేయవచ్చు అని రాజమౌళి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . మహేష్ బాబు లాంటి హీరో టాలీవుడ్ లో ఎంతో అరుదుగా ఉంటారు. ఆయన తన నటనలో గాని అందంలో గాని ఆయనకు ఆయనే పోటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక్క ఎత్తు అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా మరో ఎత్తు.. ఈ సినిమాతో ప్రపంచ సినిమాని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు .. మహేష్ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం కానీ ఆయనలో ఒక క్వాలిటీ అంటే మాత్రం జక్కన్నకు అసలు నచ్చదట. అది ఏమిటంటే మహేష్ బాబు ఏ సన్నివేశమైన సరే తానే ఓన్‌గా నటించి చూపిస్తూ ఉంటాడు .. కానీ హీరోలు ఎంతో విలువైన వారు వాళ్ళకి ఏమైనా జరిగితే సినిమాకి అంతరాయం కలగటమే కాకుండా వాళ్ళ అభిమానులు దగ్గర నుంచి దర్శకులకు వార్నింగులు , బెదిరింపులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ..
వాటన్నిటికీ మించి హీరోలని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే రీస్కీ కి సన్నివేశాలు ఏవైనా సరే డూప్ లతోనే చేయించడానికి దర్శకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు .. అయితే ఇక్కడ మహేష్ బాబు మాత్రం ఎక్కువగా సొంతంగా స్టంట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .. గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో కూడా ఆయనే ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకి దూకేశాడు. ఇలా ఇలాంటి రీస్క్ కి సన్నివేశాలు చేయడానికి మహేష్ ఎప్పుడు రెడీగా ఉంటారు .. కొన్ని అలా చేస్తే బాగా ఉంటుంది .. కానీ ప్రతి షార్ట్ వాళ్లే చేయాలంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రావచ్చు .. మహేష్ మాత్రం తానే సొంతంగా చేయడానికి ఎప్పుడు ఆస్తకి చూపిస్తూ ఉంటాడు .. మహేష్ లో ఉన్న ఈ ఒక్క క్వాలిటీ రాజమౌళికి అసలు నాచుదట .. అలాంటి రిస్కీ సన్నివేశానికి డూపులను వాడ్డుకోవాలని రాజమౌళి ఎప్పుడు సలహా ఇస్తూ ఉంటారట.