టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటిస్తున్న మూవీ మజాకా .. సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాధరావు నకిన దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ధమాకా దగ్గర నుంచి త్రినాద్ రావు నక్కిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది .. గతంలో కూడా సినిమా చూపిస్తా మామా , ధమాకా , నేను లోకల్, వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు .. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి యూత్ ఫుల్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .. ఇక సందీప్ గురించి మాట్లాడాలంటే ఆయన కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలో ప్రేక్షకుల మెప్పించాడు .. ఆయన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తన నటనతో ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరవుతూనే వస్తున్నాడు.


మొదటి సినిమా ప్రస్థానం దగ్గర నుంచి తన నటనతో ప్రేక్షకులను ఎప్పుడు అబ్బుర పరుస్తూనే వస్తున్నాడు .. అలాగే ఊరి పేరు భైరవకోన సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు .. అలాగే ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు .. అయితే ఈ సినిమా ప్రమోషన్ల బిజీగా ఉన్న సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ హీరో మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్లు చేశాడు .. తాన‌ను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని కూడా చెప్పుకొచ్చాడు తాను సైనస్ తో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు.


సినిమా షూటింగ్లో జరుగుతున్నప్పుడు గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి  నిద్ర పోతానని కూడా చెప్పాడు .. పడుకున్న తర్వాత నా ముక్కు నుంచి తన వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని కూడా తెలిపాడు .. అలాగే ఉద్యాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను .. నా తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను ఉదయాన్నే వేడిగా టీ తాగి మెడిటేషన్ మ్యూజిక్,  దేవుని స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడతాన చెప్పాడు .. అలాగే దీని కోసం సర్జరీ కూడా చేయించుకోవాలని .. అలా ఆపరేషన్ చేయించుకుంటే తన ముక్కు మారిపోతుందని మొఖం మారిపోతుందని భయమేసి ఆపరేషన్ చేయించుకోవడంలేదని సందీప్ అన్నాడు .. అలాగే నెలరోజుల పాటు షూటింగ్లకు గ్యాప్ ఇవ్వాలి ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి అందుకే నాకు భయమని సందీప్ చెప్పుకొచ్చారు .. ఇప్పుడు ప్రజెంట్ ఈ హీరో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: