
కానీ రాజమౌళి లైఫ్ లో ఒక తీరని కోరిక అలాగే ఉండిపోయింది అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది. చాలామంది హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని ఆశపడుతూ ఉంటారు . ఆ మూమెంట్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అయితే ఎంతోమంది హీరోలు రాజమౌళి తో ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలి అని ఆశ పడుతున్నారు .
రెండు మూడు కథలు ఆ హీరోకి వినిపించినా కొన్ని కారణాలు చేత రిజెక్ట్ చేశారు . ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . విజయేంద్ర ప్రసాద్ కి రాజమౌళి కి పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం ఈ విషయాన్ని పలు సందర్భాలలో ఓపెన్ గానే చెప్పారు . అయితే రాజమౌళి - పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలి అని చాలా చాలా అసలు పెట్టుకున్నారు. కానీ ఇక అది జరగని పని అని అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలో నటించడు . కమిట్ అయినా సినిమాలు తప్పిస్తే కొత్తగా సినిమాలు కమిట్ అవ్వడం లేదు. అంతేకాదు రాజమౌళి - పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలి అన్న కోరిక అలాగే తీరని కోరికగా మిగిలిపోతుంది అంటున్నారు అభిమానలు...!