
అలాంటి త్రివిక్రమ్ కొడుకు దర్శకుడుగా అడుగు పెట్టబోతున్నాడు .. అందుకోసం ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్ లాంటి పెద్దవాళ్లు తలుచుకుంటే వారి పిల్లలకు అవకాశాలకు అలాంటి లోటు ఉండదు .. అందుకే కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని .. తర్వాత మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దగ్గరకు త్రివిక్రమ్ పంపించారు .. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు త్రివిక్రమ్ కొడుకు .. ఇక ఆ సినిమా ఇప్పుడు పూర్తి కావస్తుంది. ఆ తర్వాత ఈసారి ట్రైనింగ్‌కు మరో సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గరకు పంపిస్తున్నారు ..
అసిస్టెంట్గా తీసుకోండి అని ఏ అనమకుడు అంటే నో అంటారేమో కానీ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కొడుకును అసిస్టెంట్గా తీసుకుండి అంటే కాదంటారా ?అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కొడుకు పని చేయబోతున్నారు. అలా అని ఈ సినిమా తర్వాత సుకుమార్ దగ్గరికో రాజమౌళి దగ్గరకో పంపించుకోవచ్చు అది వేరే విషయం .. అలాగే తండ్రి త్రివిక్రమ్ చేసే పాన్ ఇండియా సినిమాకు కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉంది .. అలాగే మరి వచ్చే రెండేళ్లలో త్రివిక్రమ్ కొడుకు కూడా మెగా ఫోన్ పడతారు .. అది పవన్ కొడుకు అకీరాతో అయిన ఆశ్చర్యపోకర్లేదు .. ఎందుకంటే పవన్ -త్రివిక్రమ్ మధ్య ఉన్న స్నేహం అలాంటిది.