
ప్రస్తుతం రష్మి జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా యాంకరింగ్ గానే చేస్తూ ఉన్నది. అయితే గతంలో రష్మీ యువ అనే ఒక సీరియల్ లో కూడా నటించిందట. అందుకు సంబంధించి ఒక వీడియో నిన్నటి నుంచి వైరల్ గా మారుతున్నది. ఈ సీరియల్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. రష్మి సీరియల్లో రాజమౌళితో పాటుగా గెస్ట్ రోల్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో నేటిజన్స్ కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
దీంతో రష్మీ అభిమానులు అప్పటికి ఇప్పటికీ ఒకే అందాన్ని మెయింటైన్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేయగా తాజాగా ఈ సీరియల్ గురించి రష్మీ ఇలా స్పందిస్తూ.. నాగార్జున గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ తన ట్విట్టర్ వేదికగా యువ సీరియల్ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది అంటూ తెలుపుతూ ప్లీజ్ నాగార్జున సార్ అంటూ ఒక రిక్వెస్ట్ మీ సైతం షేర్ చేసింది రష్మీ. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయం పైన అటు నాగార్జున ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.