
కాగా ఇలాంటి మూమెంట్లోనే మెగాస్టార్ చిరంజీవికి అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మధ్య జరిగిన ఒక గొడవ గురించి బయటపడింది . ఆ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా హీట్ పెంచేస్తుంది. కాగా ఇది రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ లో అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది . రామ్ చరణ్ హీరో అవ్వాలి అని తన వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అని చిరంజీవి ఎప్పటినుంచో కోరుకుంటూ వచ్చారట. అందుకే చిన్నతనంలోనే ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ డాన్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేలా చేశారట.
అయితే ఇక చిరుత సినిమా స్టార్ట్ అవుతుంది అనుకున్న మూమెంట్లో ఫిజిక్ చరణ్ కి అంత పర్ఫెక్ట్ గా లేదు అని గ్రహించిన చిరంజీవి యాక్టర్ శ్రీహరి వద్దకు ట్రైనింగ్ కి పంపించారట. శ్రీహరి ఎంత స్క్రిప్ట్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే రెండు మూడు రోజులు సైలెంట్ గా వెళ్ళిన రామ్ చరణ్ నాలుగవ రోజు నుంచి "ఆయన బోలెడన్ని కండిషన్స్ పెడుతున్నాడు ..ఆయనతో వేగలేకపోతున్నాను ..నావల్ల కాదు అంటూ నేను వెళ్లనే వెళ్ళను "అంటూ బాగా మొండి చేశారట .
అయిన చిరంజీవి అస్సలు ఒప్పుకోలేదట ..వెళ్లాల్సిందే అంటూ మొండి గా ఉన్నారట . అంతేకాదు ఒకానొక మూమెంట్లో చరణ్ కి కోపం వచ్చి "ఇలాగే నన్ను మొండిగా ఆయన దగ్గరకు పంపిస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట". దీంతో చరణ్ పరిస్థితి అర్థం చేసుకున్న చిరంజీవి మెల్లగా అసలు ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటి ..? ఆయన ప్రాబ్లం ఏంటి..? అన్న విధంగా అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేశారట . ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత రామ్ చరణ్ స్వయంగా శ్రీహరి వద్దకు ట్రైనింగ్ కి వెళ్లేవాడు. అంతలా చిరంజీవి తన మాటలతో మాయ చేసేస్తాడు అంటున్నారు జనాలు..!