
తన సొంత ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ‘మా ఇంటి బంగారం’ నిర్మించాలని ప్రయత్నించినప్పటికీ ఆప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం ఆమె దృష్టి అంతా వెబ్ సిరీస్ లు పై మాత్రమే ఉంది. ఇటీవలే వచ్చిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీకి ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో స్పందన రాకపోవడం కొంత నిరాశ సమంతకు ఎదురైంది అన్న వార్తలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె ఆశలు అన్నీ నిర్మాణ దశలో ఉన్న వెబ్ సిరీస్ రక్త్ భ్రమండ్ పై ఉన్నాయి. దీనిపై ఆమెకు భారీ అంచనాలు ఉన్నాయి. తుంబాడ్ వెబ్ సిరీస్ సృష్టికర్త దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో ఆమె దీనిపై చాల ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు చిన్న బ్రేక్ పడినట్లు లీకులు వస్తున్నాయి.
సెప్టెంబర్ 2024 లో షూటింగ్ మొదలుపెట్టిన రక్త్ భ్రమండ్ షూటింగ్ పార్ట్ లో కనీసం 50 శాతం కూడ పూర్తి కాకుండానే ఈ మూవీకి ఖర్చు పెట్టాలి అనుకున్న బడ్జెట్ అంతా ఖర్చు అయిపోవడంతో పొరపాటు ఎక్కడ జరిగింది అన్న విషయం పై ఈ వెబ్ సిరీస్ నిర్మాతలు అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో మళ్ళీ ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు సమంతకు టెన్షన్ తప్పదు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ సమంతతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కథలు విషయంలో కన్ఫ్యూజన్ లో ఆమె దేనికి ఓకె చేయడంలేదు అని టాక్..