ఆర్ ఆర్ ఆర్’ మూవీతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన రాజమౌళి వ్యక్తిత్వం పై ఎవరు ఎటువంటి గాసిప్పులు ప్రచారంలోకి తీసుకు రావడానికి సాహసం చేయరు. అయితే అలాంటి రాజమౌళి సంబంధించిన ఒక లవ్ ట్రాక్ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఆ వీడియోను ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు అనేకమంది చూశారు.



రాజమౌళి సినీ దర్శకుడు కాకముందు టివి సీరియల్స్ కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆరోజులలో రంగనాథ్ కీలక పాత్రలో ‘శాంతినివాసం’ అనే సీరియల్ కు మంచిపేరు వచ్చింది. ఆతరువాత దర్శకుడుగా మారిన తరువాత జక్కన్న కొన్ని సీరియల్స్ లో నటించాడు అన్నవిషయం చాలామందికి తెలియదు. రాజమౌళి తన బంధువు అయిన గుణ్ణం గంగరాజు ప్రొడ్యూస్ చేసిన ‘అమృతం’ సీరియల్ లో నటించాడు.



అక్కినేని నాగార్జున నిర్మించిన ‘యువ’ సీరియల్ లో కూడ రాజమౌళి చిన్న అతిధి పాత్రలో నటించాడు. అప్పటికే ‘విక్రమార్కుడు’ సూపర్ సక్సస్ తో రాజమౌళి పేరు అందరికీ తెలిసిపోయింది. యువ సీరియల్ లో రష్మి గౌతమ్ కృష్ణుడు కరుణశ్రీ విశ్వ వాసు అనేకమంది నటించారు. అనుష్క కూడ ఈ సీరియల్ లో ఒక అతిధి పాత్రలో చేసింది. ఈమూవీలో రేష్మీకి రాజమౌళికి సంబంధించిన ఒక లవ్ ట్రాక్ సీన్ ఉంది. అప్పట్లో ఆ సీన్ ను ఎవరు పెద్దగా పట్టించు కోలేదు.



అయితే ఒక నటిజన్ ఆ సీరియల్ లోని ఆ లవ్ ట్రాక్ సీన్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాలలో ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఒక అతిధి పాత్రలో జక్కన్న కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జక్కన్న కూడ దాసరి విశ్వనాథ్ లా నటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: