కామెడీ సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న అల్లరి నరేష్ కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమయ్యాక తన రూట్ మార్చి వేరే జానర్ లో సినిమాలు చేస్తున్నారు. కామెడీ ని పక్కన పెట్టి యాక్షన్ థ్రిల్లర్ జానర్స్ లో సినిమాలు చేస్తున్నారు. నరేష్ కి పెళ్ళై పిల్లలున్న సంగతి మనకు తెలిసిందే. కానీ అందరిలాగే అల్లరి నరేష్ సినీ లైఫ్ లో కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. అదేంటంటే ఓ హీరోయిన్ తో ఎఫైర్.. అల్లరి నరేష్ చాలామంది హీరోయిన్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.కానీ ఒకే ఒక్క హీరోయిన్ తో అల్లరి నరేష్ ఎఫైర్ వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ నటి ఫర్జానా.. అల్లరి నరేష్ ఫర్జానా కాంబినేషన్లో సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే రెండు సినిమాల్లో కలసి ఈ జోడి నటించడంతో వీరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపించాయి. 

అయితే ఈ రూమర్ల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అల్లరి నరేష్..అలాంటిది ఏమీ లేదు.ఆల్రెడీ ఫర్జానాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.కానీ ఈ విషయం తెలియని జనాలు మా ఇద్దరి మధ్య ఏవేవో ఉన్నట్టు రాశారు.అయితే షూటింగ్ సెట్ కి కూడా ఫర్జానా తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చేది.దాంతో మా ఇద్దరి మధ్య లేనిపోని రూమర్స్ వస్తున్నాయి నువ్వైనా చెప్పురా అని హీరోయిన్ అడిగితే... ఓ అవునా నిజమేనా అని ఫన్నీగా నవ్వే వాడు.అయితే ఫర్జానాతో నాకు ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సమయంలో మా నాన్నకి కూడా ఈ విషయం చెప్పాను. మా నాన్న ఇవివి సత్యనారాయణ గారు కూడా ఓ అది నిజమేనారా..నా కోడల్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని రియాక్ట్ అయ్యేవారు.

ఇక ఆయన మాటలకు నేను కూడా నవ్వే వాడిని. ఇండస్ట్రీలో జరిగే ఏ విషయాన్నీ కూడా మా నాన్న దగ్గర దాయలేదు అంటూ ఫర్జానాతో వచ్చిన ఎఫైర్  వార్తలపై  ఓ ఇంటర్వ్యూలో స్పందించారు అల్లరి నరేష్. అలాగే మీరు కితకితలు సినిమాలో నటించారు కదా.. అలాంటి వైఫ్ మీకు వస్తే ఏం చేస్తారు అని యాంకర్ అడగగా..అలాంటి వైఫ్ వచ్చినందుకు నేనేమి బాధపడను. అందం,డబ్బు అనేది ఎప్పటికీ మన దగ్గర శాశ్వతంగా ఉంటుందని నేను అనుకోను. మనల్ని అర్థం చేసుకునే వారు మన లైఫ్ లోకి వస్తే అమ్మాయి ఎలా ఉన్న పర్వాలేదు అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.అయితే అప్పుడు అల్లరి నరేష్ మాట్లాడిన వీడియో మళ్ళీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: