టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఇతను తన సినిమాలతో భారీగా లాభాలను పొందుతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాల కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించి భారీగా లాభాలను పొందారు.


అందులో ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ లో ఉన్నారట. అయితే ఇది కాస్త రిస్క్ అని కొంతమంది అంటున్నారు. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నారు.


అందువల్ల ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను వేరే వ్యక్తి తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఓకే అయిన వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను కాస్ట్ చేయాలని ప్లాన్ లో దిల్ రాజు ఉన్నారట. అయితే దీని గురించి నిర్మాత దిల్ రాజు అక్షయ్ కుమార్ కి గతంలోనే అడ్వాన్స్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


మరి ఈ సినిమా లో హీరోయిన్లను ఫిక్స్ చేసే పనిలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. ప్రస్తుతం సంక్రాంతి వస్తున్నాం సినిమా రీమేక్ పనులలో దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నారట. దర్శకుడు ఓకే అయిన వెంటనే సినిమా పనులను ప్రారంభించే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నారట. మరి ఈ సినిమా హిందీలో రీమేక్ అయి మేరకు లాభాలను సంపాదిస్తుందో చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: