
ప్రస్తుతం రష్మిక మందన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. రీసెంట్ గా రష్మిక మందన హీరో విక్కీ కౌశల్ తో నటించిన "ఛావా" సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శంబాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
వరుసగా పుష్ప2, చావా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఈ భామ ఈ సంవత్సరం మరో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరంలో ఈద్ సందర్భంగా సికిందర్ తో రష్మిక మందన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళంలో రూపొందించిన కుబేర సినిమాలోను ఈ చిన్నది నటించింది.
అంతే కాకుండా రష్మిక మందన హిందీలోనూ మరో సినిమాలో నటించబోతోంది. ఈ నాలుగు సినిమాలతోనే కాకుండా హీరో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న కింగ్డమ్ సినిమాలోనూ ఈ బ్యూటీ నటించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఆ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే ఈ బ్యూటీ నటించింది. ఇవే కాకుండా ఈ బ్యూటీ మరికొన్ని సినిమాలలో కూడా నటించడానికి ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది.