టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పటి కాలంలో హీరోయిన్లు ఎంతో పద్ధతిగా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకునేవారు. కానీ నేటి కాలంలో చాలావరకు ఎక్స్పోజింగ్ పాత్రలను చేసుకుంటూ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అంతేకాకుండా ఒకప్పటి హీరోయిన్లు ఎంతో పద్ధతిగా సినిమాలలో నటించినప్పటికీ అలాంటి వారు ఇప్పుడు ఎక్స్పోజింగ్ సినిమాలను చేస్తూ ప్రతి ఒక్కరు ఆశ్చర్య పరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పటి హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.


బ్యూటీ ఎన్నో సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. అయితే కొద్ది రోజులపాటు త్రిష తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. ఇక తెలుగులో వరుసగా త్రిష సినిమాలు చేయడం ప్రారంభించింది. దాదాపు త్రిష 20 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది.


ఇప్పటికీ వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, అదే ఫిట్నెస్ కొనసాగిస్తూ అగ్ర హీరోయిన్ గా చలామణి అవుతోంది. ప్రస్తుతం త్రిష వరుసగా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ బిజీగా మారిపోయింది. 40 పదుల వయసు వచ్చినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా హాట్ గా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసుకుంటుంది.


ఆ ఫోటోలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ కొద్ది రోజుల నుంచి ఓ హీరోతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే అతను మలయాళ హీరో కావడం విశేషం. అతనితో చాలా కాలం నుంచి డేటింగ్ లో ఈ చిన్నది  ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై త్రిష ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: