
ఆ డైరెక్టర్ ఎవరో కాదు గౌతమ్ తిన్ననూరి. ఇతడి దగ్గర త్రివిక్రమ్ కుమారుడు శిక్షణ తీసుకుంటున్నారట.. విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారట రిషి మనోజ్. దాదాపుగా ఈ సినిమా ప్రాజెక్టు కూడా పూర్తి అయింది. అలా సినిమా పూర్తి అయిన తర్వాత మరొక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దగ్గర రిషి వెళ్లబోతున్నారని విధంగా తాకు వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దగ్గరకు స్వయంగా త్రివిక్రమే ఫోన్ చేసి తన కుమారుడని అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోవాలని కోరడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయబోతున్నారట. మరి ఈ రెండు ప్రాజెక్టులు అనంతరం త్రివిక్రమ్ కుమారుడు రిషి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి మరి. అలాగే మరో రెండేళ్లలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అటు అకీరా, ఇటు రిషి ఇద్దరు కూడా ఒకే ప్రాజెక్టుతోనే ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటి అన్నది ఎవరు స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది.