డైరెక్టర్ అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ దర్శకుడిగా తన హవాను చూపిస్తున్నారు. అనిల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో తీయాలని నిర్ణయం తీసుకున్నాడు. 

ఈ విషయం పైన తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా చేస్తానని ఒప్పుకోవడం నిజంగా సంతోషకరం. కాగా, ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిరంజీవి అనౌన్స్ చేశాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చిరంజీవి చెప్పారు. ఆఅంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార ను ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం నయనతార ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా ముందు వరుసలో కొనసాగుతున్నారు. ఈమె ఒక్క సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. మరి చిరంజీవితో నటించడానికి ఏ మేరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... చిరంజీవి ఈ సినిమాలో నటించినందుకు కేవలం రూ. 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నారట. అంతేకాకుండా సినిమా హిట్ అయి లాభాలు వచ్చినట్లయితే అందులో వాటలు తీసుకోవడానికి డీల్ కూడా ఒకే చేసుకున్నారని సమాచారం అందుతుంది.


అనిల్ రావిపూడి మీద నమ్మకంతో నిర్మాతలు సైతం వాటికి ఒప్పుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోయే సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని కొంతమంది అంటుంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని సమాచారం అందుతుంది. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: