
అలాగే స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేసేందుకు కథ ను రెడీ చేస్తున్నారు .. ఇప్పటివరకు తాను చేయని కొత్త జోనర్లు ఈ సినిమా ఉండబోతుందట .. అలాగే చారిత్రిక నేపథ్యం ఉన్న కథను ఇందుకు ఎంచుకున్నారు .. ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు గురూజీ .. అలాగే దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టబోతున్నారు .. అయితే ప్రభాస్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు .. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
అయితే బాహుబలి సినిమాలకు ముందు ప్రభాస్ మిర్చి సినిమాలో నటించారు .. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు బాహుబలి సినిమాలకి కేటాయించారు .. అయితే ఆ సమయంలో త్రివిక్రమ్ ఓ కథను రెడీ చేసి ప్రభాస్ కు చెప్పారట .. అయితే బాహుబలికి ఐదు సంవత్సరాలు ఒప్పందం కుదరడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు .. ఆ కథను త్రివిక్రమ్ అలాగే ఉంచారా ? లేక వేరే హీరోతో ఏమైనా సినిమా తీశారా ? అనే విషయంపై గురూజీ క్లారిటీ ఇవ్వలేదు .. కానీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే మాత్రం ఇండస్ట్రీ రికార్డులని బద్దలు ఇవ్వడం ఖాయమని సిని విశ్లేషకులు కూడా అంటున్నారు . ఇక మరి రాబోయే రోజులైనా ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.