ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల పెళ్లిళ్లు గట్టిగానే జరుగుతున్నాయి .. అయితే వారిలో కొంతమంది విడాకులు కూడా తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు .. కొందరు స్టార్ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా తము విడిపోతున్నట్టు ప్రకటిస్తూ అభిమానులకు షాక్లిస్తున్నారు .. తెలుగు , తమిళ , హిందీ ఇండస్ట్రీలో చాలామంది విడాకులు అనౌన్స్ చేశారు .. పెళ్లి చేసుకుని కేవలం రెండు మూడేళ్లకే విడిపోయిన వారు కొందరైతే .. మరికొందరు 20 సంవత్సరాలు కలిసి ఉండి కూడా విడిపోయిన వారు ఉన్నారు .. అయితే ఇప్పుడు ఓ స్టార్ కపుల్ విడాకులు తీసుకోవడానికి ఓ హీరోయిన్ కారణమంటూ ఈ రీసెంట్గా వార్తలు వస్తున్నాయి .. ఆ హీరోయిన్ తో సంబంధం ఉండటంతో ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేసాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది .. అలాగే ఆ హీరోయిన్ మోజులో పడి భార్యను వదిలించుకున్నాడు అంటూ ఆ హీరోను , ఆ హీరోయిన్ ను భారీ రేంజ్ లో వేసుకుంటున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఆ హీరోయిన్ ఎవరు అనేది స్టోరీలో చూద్దాం.


ఒకే ఒక్క సినిమాతో ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు చాలామంది ఉన్నారు .. అలాంటివారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు .. తన అందంతో యువతను పిచ్చెక్కించింది .. ఆమె సినిమా వస్తుందంటే పడి చచ్చిపోతున్నారు ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివ్యభారతి .. కోలీవుడ్లో బ్యాచిలర్ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ .. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవి ప్రకాష్ తో కలిసి నటించింది .. అలాగే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలో కూడా రెచ్చిపోయిన నటించింది .. దాంతో ఈ ఇద్దరు మధ్య ఏదో గ‌ట్టి నడుస్తుంది అంటూ వార్తలు గట్టిగా వైరల్ అయ్యాయి.


ఇక జీవీ ప్రకాష్ తన భార్య సైంధవి  రీసెంట్ గానే విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే .. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు .. ఇక దాంతో అందరూ ఒక్కసారిగా దివ్యభారతి పై ఊహించని విధంగా మండిపడుతున్నారు .. అలాగే జీవి ప్రకాష్ , దివ్యభారతి మాయలో పడి భార్యకు విడాకులు ఇస్తున్నారని చాలామంది ఆమెను సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారు .. తాజాగా దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవి ప్రకాష్ , దివ్యభారతి కలిసి ఇప్పుడు కెప్టెన్ అనే సినిమాలో నటిస్తున్నారు .. అలాగే ఈ సినిమా ప్రమోషన్లను భాగంగా జ‌రిగిన‌ ఇంటర్వ్యూలో దివ్య భారతి , ప్రకాష్ ఈ విషయంపై రిప్లై ఇచ్చారు .. కొంతమంది జీవి తన భార్యతో విడపోవడానికి నేనే కారణమని దారుణంగా నాపై విమర్శలు చేస్తున్నారని ఆమె అంటుంది .. అలాగే బ్యాచిలర్ సినిమాలో మా కెమిస్ట్రీ బాగుంది .. ఇక దాంతో మేము రిలేషన్ లో ఉన్నామంటూ తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారని దివ్యభారతి చెప్పుకొచ్చింది.  అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: