
తన తల్లి అంజినమ్మ అస్వస్థకు గురైందని విషయం తన దృష్టికి వచ్చిందని అయితే ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు ఆమె కోలుకుంది ఎలాంటి ఇబ్బంది లేదంటూ వెల్లడించారు.. దయచేసి మీడియా మిత్రులు ఎవరు కూడా ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి రూమర్స్ సృష్టించవద్దండి అంటూ కోరడం జరిగింది చిరంజీవి. నిన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు కూడా చాలా సింపుల్గా జరుపుకున్నారు. ముఖ్యంగా నాగార్జున దంపతులతో పాటుగా మహేష్ బాబు భార్య తదితరులు సైతం దుబాయ్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.
ఇక త్వరలోనే జరగబోతున్న ఛాంపియన్ ట్రోఫీ 2025 మ్యాచ్కు సైతం చిరంజీవి కూడా గెస్ట్ గా హాజరు కాబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాతో ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ కారణం చేత ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించబోతున్నారట ఇందులో త్రిష హీరోయిన్ గా నటించగా చాలామంది సెలబ్రిటీలు కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొత్తానికి తన తల్లి మీద వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు చిరంజీవి.