
అయితే ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన పొందాయి. షూటింగ్ మొదలు అయినప్పటినుంది ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు.. కానీ పలు కారణాల వలన అది వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాని మహాశివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శివరాత్రి కానుకగా ఈ నెల 26న మజాకా సినిమా విడుదల కానుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల సందీప్ కిషన్ ఫ్యాన్ వార్ ల పైన స్పందించారు. 'ఈ మధ్యకాలంలో ఫ్యాన్ వార్ లు చాలా చెత్తగా మారాయి. అంతా చెత్తగా ఉంటాయని అసలు అనుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పీఆర్ టీమ్ ఉంటుంది. ఈ ట్రెండ్ ముంబై లో ఎప్పటినుండో ఉంది.. ఇక్కడ ఇప్పుడే మొదలైంది. మన తరుపున మాట్లాడడానికి కచ్చితంగా ఒక టీమ్ ఉండాలి. మన గురించి జనాల్లోకి తీసుకెళ్లాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా' అంటూ పీఆర్ గురించి సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.