నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా వదులుకున్న సినిమాలలో కొన్ని బాక్సా ఫీస్ దగ్గర అపజాయలను అందుకుంటే కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తన కెరీర్ లో వదిలేసిన ఓ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కానీ బాలకృష్ణసినిమా కథ నచ్చక వదిలిపెట్టలేదట. ఆ కథ తనపై బాగోదు అని వేరే హీరో పేరును ఆయనే స్వయంగా సూచించాడట. ఇక బాలకృష్ణ చెప్పిన విధంగానే ఆ మూవీ నిర్మాత బాలకృష్ణ సూచించిన హీరోతో ఆ మూవీ ని రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుందట. ఇంతకి ఆ సినిమా ఏది ..? బాలకృష్ణ సూచించిన ఆ హీరో ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా భీమ్లా నాయక్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ నటించగా ... రానా కి జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఇకపోతే ఈ సినిమా ఓ మలయాళ మూవీ కి అధికారిక రీమిక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే మలయాళ సినిమా యొక్క హక్కులను కొనుగోలు చేసిన తర్వాత నాగ వంశీ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ చేసిన పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటాడు అని ఆయనను కలిసి ఆయనకు ఈ సినిమాను కూడా చూపించాడట. సినిమా మొత్తం చూసిన బాలకృష్ణసినిమా అద్భుతంగా ఉంది. కానీ ఈ సినిమాలో నన్ను మీరు అనుకుంటున్న పాత్రకు నాకంటే కూడా పవన్ కళ్యాణ్ అయితే సూపర్ గా సెట్ అవుతాడు అని సలహా ఇచ్చాడట. ఆ సలహా మేరకు నాగ వంశీ , పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కు కూడా మంచి పేరు కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk