తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ఈయన రాజమౌళి తో చేసిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఒకవేళ ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పాన్ ఇండియాలో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక ఇప్పటికే ఆయనకు ఇండియా వైడ్ గా భారీ అభిమానులైతే ఉన్నారు. మరి ఆ అభిమానులందరిని అలరించడానికి ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి  దర్శకత్వంలో చేస్తున్న ఫౌజి  సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రభాస్ మాత్రం ఫౌజీ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన స్టార్ డమ్ అనేది మరింతలా పెరిగే అవకాశమైతే ఉంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్రనైతే పోషించలేదు. కాబట్టి ఇది చాలా కొత్తగా ఉండడమే కాకుండా చూసే ప్రేక్షకుడిని సైతం అలరించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ప్రభాస్సినిమా క్లైమాక్స్ లో చనిపోతాడు అంటూ ఒక ట్విస్ట్ అయితే రివిల్ అయినట్టుగా తెలుస్తోంది.మరి ప్రభాస్ ఎందుకు చనిపోతాడు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా ఉండవా అనే అంశాలు కూడా తెరమీదకి రాబోతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్  సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతుంది అంటూ తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ అయితే అవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: