పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ నుంచి విడుదల కానున్న తొలి మూవీ ఇదే కానుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ పీరియడ్ యాక్షన్ మూవీకి తొలుత డైరెక్టర్ క్రిష్ కొంత భాగం దర్శకత్వం వహించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరక్షన్ చేస్తున్నారు.హరి హర వీరమల్లు సినిమా నుంచి నేడు ఫిబ్రవరి 21 రెండో పాట ప్రోమో రిలీజ్ అయింది.ఈ క్రమంలో హరి హర వీరమల్లు చిత్రంలోని కొల్లగొట్టినాదిరో పాట ప్రోమో నేడు వచ్చేసింది. "కోరకోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో" అంటూ అదిరే పదాలతో పాట ప్రోమో మొదలు కాగా.. పవన్ కల్యాణ్ ఓ కర్ర పట్టుకొని సూపర్ ఎంట్రీ ఇచ్చారు. "కొంటె.. కొంటె చమకులతో.. కొలిమి లాంటి మగటిమితో.. సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు" అంటూ మంచి బీట్‍తో ఈ పాట సాగింది. పవన్ కల్యాణ్ స్వాగ్‍తో అలా కర్ర తిప్పుతూ అదిరిపోయే లుక్‍తో ఉన్నారు. అనసూయ భరద్వాజ్, పూజిత ఈ పాట ప్రోమోలో కనిపించారు. పవర్‌ఫుల్ పదాలతో ఈ ప్రోమో ఉంది.

హరి హర వీరమల్లులో ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంచి ఊపున్న బీట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. డ్యాన్స్ నంబర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామినీ ఘంటశాల పాడారు. ప్రోమోలో మంగ్లీ వాయిస్ ఉంది. ఈ పాటకు చంద్రోబోస్ లిరిక్స్ అందించారు.ఇందులో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' పాటను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్, మంగ్లీ వాయిస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది సాంగ్. ఫుల్ సాంగ్ 24న మధ్యాహ్నం 3గంటలకు రానుంది. ఈ పాటలో యాంకర్ అనసూయ స్పెషల్ అపియరెన్స్ గా కనిపించబోతుంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' 2025 మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: