
కథ: విక్రమ్(అదిరే అభి) జూదానికి బానిసై తను పనిచేస్తున్న కంపెనీలోని కోటి రూపాయలు కొట్టేసి బెట్టింగ్ ఆడతాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆయన డబ్బు మొత్తం బెట్టింగ్ లో పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు... లీగల్ గా కేసులో ఇరుక్కుంటాడు. అతనికి రుధిర(స్వాతి మండల్) అనే ఎయిర్ హోస్టెస్ ప్రియురాలు వుంటంది. విక్రమ్ కి ఉద్యోగం పోవడంతో తనే ఆర్థికంగా ఆదుకుంటూ... తన బాగోగులు చూస్తూ వుంటుంది. తను కొట్టేసిన కోటి రూపాయలను వెంటనే కట్టాలని కంపెనీ యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది. అదే సమయంలో రుధిర ఒక యాంటిక్ చైర్ ను ఎంతో ఇష్టపడి కొని తెచ్చుకుని ఇంట్లో పెడుతుంది. ఆ చైర్ వల్ల అభికి కావాల్సినప్పుడల్లా డబ్బులు వచ్చి పడుతుంటాయి. అయితే రూ.5 కోట్ల రూపాయలు ఇస్తా... నీ ప్రియురాలని చంపేయాలని ఆ చైర్ కు ఒక డెవిల్ శక్తి ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్... రూ.5కోట్ల కోసం తన ప్రియురాలని చంపాడా? అసలు ఆ చైర్ లో ఉన్నది ఎవరు? అది విక్రమ్ ను ఎలా తన వశం చేసుకోవడడానికి ప్రయత్నిస్తుంది? ఆ చైర్ వెనుక వున్న బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. మనిషికి ఉండే దురాశ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. మంచి కాన్సెప్ట్ తో పాటు మంచి సందేశం కూడా ఇచ్చారు. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు గంగ సప్తశిఖర సక్సెస్ సాధించాడు అనే చెప్పొచ్చు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా నచ్చుతుంది.
జబర్దస్త్ షోతో అదిరే అభిగా పరిచయమై మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా అటు బుల్లితెరపైనా... ఇటు వెండితెరపైనా కనిపిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. ఎంతో క్రమశిక్షణతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న అభి... ది డెవిల్స్ చైర్ లో ఈజీ మనీకి అలవాటు పడిన ఓ దురాశకలిగిన వ్యక్తి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. దర్శకుడు గంగ సప్త శిఖర తొలి సినిమానే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుని గొప్ప సాహసమే చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రయోగాత్మక చిత్రంతోనే తొలి అడుగు వేసి విజయం సాధించారనే చెప్పొచ్చు.
రేటింగ్: 2.75