ఇటీవలే చాలా పాత చిత్రాల సైతం 4k లో విడుదల చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు నిర్మాతలు.. అలా ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కల్ట్  క్లాసికల్ చిత్రంగా మిగిలిపోయిన చిత్రం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి కాంబినేషన్లో ఈ సినిమా రావడం జరిగింది.


మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా  నటించారు. ప్రకాష్ రాజు నటన జయసుధ తదితర నటీనటుల నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు మార్చి 7వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అటు వెంకటేష్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చేస్తున్నారు. కుటుంబ విలువలు, మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమానురాగాలు, జీవిత సత్యాలు వంటివి ఇందులో చాలా గొప్పగా చూపించారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కించగా దిల్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు మరొకసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.



ఇక డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఒక సరికొత్త నాందికి తెర తీసిందని చెప్పవచ్చు. ఇక మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తూ ఉండగా వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని 300 కోట్ల క్లబ్ లోకి చేరారు. అభిమానులు మాత్రం మరొకసారి ఏదైనా సినిమాలో కలిసి నటించాలి అంటూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: