
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరు ఒకరికి.. ఒకరు ఎప్పుడు సాయం చేసుకుంటూ ఉంటారు. కళ్యాణ్ రామ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా జై లవకుశ లాంటి సూపర్ హిట్ సినిమా చేసి కళ్యాణ్ రామ్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు భార్యలు అయినా లక్ష్మీ ప్రణతి, స్వాతి ఇద్దరు కూడా తోడికోడళ్ళు అయినా.. అక్కా, చెల్లెళ్లలా ఎంతో అన్యోన్యతతో ఉంటారు. అయితే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఇష్టమైన హీరోలు ఎవరు.. ఆ సినిమాలు ఏమిటి.. అన్నది ఆసక్తికరమే.
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి.. చిన్నప్పటి నుంచి అక్కినేని నాగార్జునకు వీరాభిమాని. నాగార్జున సినిమా రిలీజ్ అయింది అంటే చాలు తొలిరోజు కాలేజీకి డుమ్మా కొట్టి మరి సినిమా చూసేవారట. మన్మధుడు సినిమాలో సైతం తొలిరోజు తొలి ఆట కాలేజ్ డుమ్మాకొట్టి ఎంజాయ్ చేశారట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో స్వయంగా చెప్పారు. కళ్యాణ్ రామ్ హిట్ సినిమా పటాస్ ప్రమోషన్ కు వచ్చినప్పుడు కళ్యాణ్ ఈ మాట చెప్పాడు.
ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతికి .. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా అంటే ఎంతో ఇష్టం అట. పెళ్లికి ముందు చరణ్ నటించిన ప్రతి సినిమా.. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసేదట లక్ష్మీ ప్రణతి. లక్ష్మీ ప్రణతికి.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో భర్త అయినా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మగధీర అయితే ఆల్ టైం ఫేవరెట్ మూవీ అట.