- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


1980వ దశంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సరిత. మరీ ముఖ్యంగా కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మరోచరిత్ర సినిమాతో ఆమె హీరోయిన్గా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా ఆమెను ఒక్కసారిగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ల లింక్‌లోకి చేర్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస‌పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు.. తమిళంలో సరిత ఎన్నో సినిమాలలో నటించారు. సరితకు తెలుగు, తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి సరిత మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ  ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్గా దూసుకువెళ్తున్నారు.


ఈ క్ర‌మంలో సరిత గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా యూట్యూబ్ ఛానల్ వారు సరిత గురించి కొన్ని వివరాలు సేకరించడం కోసం.. గుంటూరు జిల్లాలోని మునిపల్లెకు వెళ్లారు. సరిత గుంటూరు జిల్లాలోని.. మోపరు గ్రామంలో జన్మించారు. ఆమె కూడా చాలా ఇంటర్వ్యూలలో తన సొంత గ్రామం గుంటూరు జిల్లాలోని మునిపల్లె అనే చెప్పారు. ఈ ఊరితో సరితకు చిన్నప్పటినుంచి మంచి అనుబంధం ఉందట. ఇక్కడ సరిత మేనత్త వెంకట నరసమ్మ ఉండేవారు.


ఆమె సరిత తండ్రి చక్రవర్తికి స్వయానా చెల్లెలు. అప్పట్లోనే వీరి కుటుంబం మంచి ఆస్తిపరులు. సరిత గురించి మునిపల్లె వాసులు చెబుతూ.. మాకు తెలిసిన సరితను మేము ఎప్పుడు మునిపల్లెలో చూడలేదు. అయితే.. ఆమె తండ్రి ఆమెను కారులో తీసుకువచ్చి వెంటనే తీసుకు వెళ్లిపోయే వారిని చెప్పారు. అఖండలో బాలకృష్ణ తల్లి పాత్ర పోషించిన వీజీ చంద్రశేఖర్.. సరితకు సోయాన చెల్లెలు. ఆమె మాత్రం మేనత్త ఇంట్లో ఎక్కువగా కనిపించేవారట. సరిత తండ్రి చనిపోయి చాలా కాలం అవుతుందని.. ఆమె తల్లి మాత్రం విజయవాడలో ఉంటున్నట్టు మునిపల్లె గ్రామస్తులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: