లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం చల్లబడి లావణ్య మస్తాన్ సాయి వ్యవహారం బయటికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే లావణ్య మస్తాన్ సాయికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టడమే కాకుండా ఒక హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులకు అప్పజెప్పింది. ఇక ఈ హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని, చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారితో ఈ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టు తేల్చేశారు. ఇక ఇందులో భాగంగా మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డప్పటికీ మరికొన్ని విషయాలు మాత్రం బయటపడడం లేదు.అయితే తాజాగా లావణ్య కు సంబంధించి ఒక షాకింగ్ ఆడియో వైరల్ అవుతుంది. అయితే ఆ ఆడియో చూసిన చాలామంది షాక్ అయిపోతున్నారు.

ఇన్ని రోజులు ఎవరైతే లావణ్యకు మద్దతు ఇచ్చారో వాళ్లే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు.మరి ఇంతకీ లావణ్య కు సంబంధించిన ఆడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. లావణ్య కి సంబంధించి తాజాగా ఆడియో కాల్ వైరల్ అవుతుంది. అందులో మస్తాన్ సాయి గురించి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న లావణ్య నీకు 50 లక్షలు ఇస్తాను.నాకు మస్తాన్ సాయితో పెళ్లి జరిగేటట్లు చూడు.. అలా చేస్తే నీకు 50 లక్షలు ఇస్తాను అంటూ ఆఫర్ చేసింది.. అంతేకాదు ఆ ఆడియో కాల్ లో నాకు రాజ్ తరుణ్ అంటే ఇష్టం లేదు.నేను రాజ్ తరుణ్ ని ప్రేమించడం లేదు.మస్తాన్ సాయిని ప్రేమిస్తున్నాను.ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. మస్తాన్ సాయి కి 100 కోట్ల ఆస్తి ఉంది.

ఆ ఆస్తి కోసమే నేను మస్తాన్ సాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాను.. నాకు రాజ్ తరుణ్ కంటే మస్తాన్ సాయి ఇష్టం.ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ లావణ్య ఓ వ్యక్తి తో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇన్ని రోజులు సుద్ద పూస లాగా మాట్లాడిన లావణ్య నిజ స్వరూపం బయటపడింది అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మస్తాన్ సాయి లావణ్య వ్యవహారం ఇంకా ఎక్కడ వరకు దారితీస్తుందో చూడాలి. ఇక వీళ్ళిద్దరే కాదు అన్నట్లు ఇందులో శేఖర్ భాష కూడా కల్పించుకోవడంతో శేఖర్ భాష పై కూడా కేసు నమోదయింది. ప్రస్తుతం పోలీసులు మొత్తం మస్తాన్ సాయిని విచారణ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: