మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ తరం స్టార్ హీరోలలో పర్ఫెక్షన్ వున్న యాక్టర్ గా తారక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. డాన్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో గానీ ఎన్టీఆర్ ఇతర హీరోల కంటే మరింత మెరుగ్గా రానిస్తున్నారు.. ముఖ్యంగా ఎన్టీఆర్ బేస్ వాయిస్ కి ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు.. ఆ వాయిస్ తో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.. అయితే ఎన్టీఆర్ ఈమధ్య కాలంలో తన సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలకి కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ చిత్రాల నుండి విడుదలయ్యే టీజర్ , ట్రైలర్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..

 రాజమౌళి తెకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ  దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఏకంగా రూ.600 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ -2’ అనే సినిమా చేస్తున్నాడు..ఆ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు..ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఛావా’ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “ఛావా” సినిమా ఫిబ్రవరి 14వ తేదీన బాలీవుడ్లో విడుదలైంది..నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ భార్యగా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్  శంభాజీ మహారాజ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.  ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విక్కీ కౌశల్ పాత్రకి ఎన్టీఆర్ వాయిస్ అందించబోతున్నారని సమాచారం..ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లు షేక్ అవుతాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: