టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోలు ఎవరు అంటే కచ్చితంగా అందులో టాప్ ఫైవ్ లో మహేష్ బాబు పేరు డెఫినెట్గా ఉంటుంది . అది అందరికీ తెలిసిందే.  మహేష్ బాబు లుక్స్ ..మహేష్ బాబు నటన .. మహేష్ బాబు డాన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి . అయితే మన ఇండస్ట్రీలో మహేష్ బాబు పెద్ద తోపైన హీరోనే కావచ్చు . కానీ పక్క భాష ఇండస్ట్రీలో మాత్రం కొందరు మహేష్ బాబుని ఎప్పుడు కూడా ఒక  విషయం కారణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు . అదే ఎక్స్ప్రెషన్స్ . ఎప్పటినుంచో మహేష్ బాబుకి ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వడం రాదు అన్న ట్రోలింగ్ జరుగుతూనే వస్తుంది.


చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినీ స్టార్స్ కూడా మహేష్ బాబుకి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్ ఇవ్వడానికి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు . కొంతమంది ఘట్టమనేని  ఫ్యాన్స్ కూడా అదే విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకున్నారు . మహేష్ బాబు ఏ సినిమాలో అయినా సరే ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు.  అది సెంటిమెంట్ ఆర్ ఎనీ థింగ్ . యాక్షన్ ద్రిల్లర్ సినిమా కావచ్చు . సెంటిమెంట్ సినిమా కావచ్చు ..లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కావచ్చు ప్రతి సినిమాలోనూ అదే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు.



ఆయన నటించిన గుంటూరు కారం సినిమా టైంలోనూ ఇదే ట్రోలింగ్ జరిగింది. అతడు సినిమాకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడో.. సేమ్ టు సేమ్ గుంటూరు కారం  సినిమాలో నటించే మూమెంట్లో కూడా అదే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు మహేష్ బాబుని జనాలు . మరొకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు . అయితే ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాతో అలాంటి ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయబోతున్నాడు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే చిత్ర బృందం మొత్తం కలిసి ఆఫ్రికా అడవుల్లో సెటిల్ కాబోతున్నట్లు తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: