హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సందీప్ కిషన్ కూడా ఒకరు..ఈయన ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. హైదరాబాదులో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ని సందీప్ కిషన్ రన్ చేస్తున్నారు. అలా ఓవైపు సినిమాలతో మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు ఈ హీరో. అయితే అలాంటి ఈయన గత ఏడాది రాయన్,ఊరి పేరు భైరవకోన వంటి సినిమాలతో మెప్పించారు. ఇక ఈ ఏడాది మజాకా అనే మూవీ తో రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పటికే టీజర్ ద్వారా బయటపడింది.తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది కొడుకుకి పెళ్లి చేసే వయసులో తండ్రి కూడా మరో అమ్మాయితో ప్రేమ లో పడి తండ్రి కొడుకుల పెళ్లి ఒకేసారి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించినట్టు అర్థం అవుతుంది. 

ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా రీతు వర్మ సందీప్ కిషన్ తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ కి జోడిగా నాగార్జున మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ నటిస్తోంది. ఈ సినిమాతో అన్షు అంబానీ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే మజాకా మూవీ ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీరు ఎవరినైనా ప్రేమించారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి సందీప్ కిషన్ మాట్లాడుతూ..నేను గతంలో ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాను.నాలుగు సంవత్సరాలు మా రిలేషన్ బాగానే ఉంది.

కానీ తర్వాత ఏమైంది కానీ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దవయ్యి చివరికి నాకు బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ బ్రేకప్ బాధ నుండి బయట పడ్డాక ఇప్పటివరకు ఎవరితో కూడా మళ్ళీ అలాంటి రిలేషన్ పెట్టుకోలేదు. నాకు హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరు.ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినీ ఇండస్ట్రీ పైనే ఉంది అంటూ సందీప్ కిషన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే సందీప్ కిషన్ నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయిని ప్రేమించారంటూ మాట్లాడడంతో నాలుగు సంవత్సరాలు సందీప్ కిషన్ ని తిప్పించుకొని వదిలేసిన ఆ అమ్మాయి ఎవరో..ఇప్పుడు సందీప్ కిషన్ స్టార్డం చూసి కుళ్ళుకుంటుంది కావచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: