
చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ సైతం 38 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా బాగానే క్రేజీ ఉన్నది. అంతేకాకుండా సోషియో ఫాంటసి సినిమా కావడం చేత అక్కడ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి కొంతమేరకు ఆసక్తి చూపిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. బింబిసారా సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పైన అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా నమ్మకం కలుగుతోందట.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకు పెద్ద ఎత్తున బిజినెస్ జరగబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. యువి క్రియేషన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే టీజర్ విడుదలైనప్పుడు చాలామంది విమర్శలు చేసిన ఎక్కువ శాతం గ్రాఫిక్స్ ఉపయోగించారని ట్రోల్ చేశారు. అందుకే మళ్ళీ రీ షూటింగ్ చేశారనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.VFX విషయంలో కూడా చిత్ర బృందం ఎక్కడ రాజీ పడకుండా చూసుకుంటుందట. అందుకే చాలామంది హాలీవుడ్ ప్రముఖులను సైతం ఇందుకోసం పనిచేయించేలా ప్లాన్ చేశారు. ఇంకా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.