
ఇండస్ట్రీలో మంచు లక్ష్మి కి స్పెషల్ ఇమేజ్ కూడా ఉండేది. నిర్మాతగా నటిగా కూడా బాగానే పేరు సంపాదించిన మంచు లక్ష్మి ఎందుకు సక్సెస్ మాత్రం కాలేకపోయింది. అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది మంచు లక్ష్మి. వీటి వల్ల కొన్ని సందర్భాలలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నది. మంచు లక్ష్మీ మాత్రం తన పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ స్పందించలేదు.. ఇటీవలే మంచు లక్ష్మి తన పెళ్లి గురించి మాట్లాడుతూ..
తన భర్త పేరు అండి శ్రీనివాసన్.. ఈయన ఫారంలో ఐటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారని తెలిపింది తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటామని సమాజంలో ప్రశాంతంగా బతికేలా స్వేచ్ఛగా బతికేస్తూ ఉన్నామని వెల్లడించింది. తమకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉంటామని అలాగే జీవిస్తామని తెలిపింది.ముఖ్యంగా జనాలు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారనే విషయాన్ని అసలు పట్టించుకోనని తన భర్తతో కలిసి ఉండడమే ముఖ్యమని వెల్లడించింది మంచు లక్ష్మి. గత రెండు నెలల వరకు భర్తతోనే కలిసే ఉన్నానని అలాగే తన కూతురు ప్రస్తుతం తన భర్త దగ్గర ఉందని తెలియజేసింది మంచు లక్ష్మి.