
న్యాచురల్ స్టార్ నాని తనకు ఎలాంటి రచయితలు నచ్చుతారో తాజాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నిజాయితీగా ఉండే కథకులు అంటే నాకు ఇష్టమని సినిమా హిట్ అవుతుందని చెప్పి కథ చెప్పేవాళ్లతో పోల్చి చూస్తే నా మనస్సులో ఒక కథ ఉందని దాన్ని చెప్పాలని ఉందని చెప్పేవాళ్లు ఎక్కువగా నచ్చుతారని న్యాచురల్ స్టార్ నాని వెల్లడించారు.
ఒక సూపర్ హిట్ కొడతామని కథ చెప్పే వాళ్లతో పోల్చి చూస్తే మీరు కొంటే కొనండి లేకపోతే లేదు నా మనస్సులో ఉన్న కథ ఇది అని చెప్పేవాళ్లు నాకు బాగా నచ్చుతారని నాని అభిప్రాయపడ్డారు. నా దగ్గరకు కథలను పట్టుకొచ్చే వాళ్లలో క్వాలిటీ ఉందో లేదో మొదట చెక్ చేస్తానని నాని తెలిపారు. కథ చెప్పే దర్శకుడు మనస్పూర్తిగా ఫీల్ అవ్వలేని సమయంలో ఆడియన్స్ ను కథలో లీనం చేయడమనేది ముఖ్యం అని నాని పేర్కొన్నారు.
నాని రెమ్యునరేషన్ 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నాని ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకుంటుండగా భవిష్యత్తులో ఈ హీరో ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయేమో చూడాల్సి ఉంది. నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. నాని ఎంతోమంది హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుండటం గమనార్హం.