బాలకృష్ణకి ఆ హీరోయిన్ తో నిజంగానే గొడవలు ఉన్నాయా.. షూటింగ్లోనే బాలయ్య బాబు అంత గొడవ చేశారా.. ఇంతకీ బాలకృష్ణ గొడవ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.బాలకృష్ణ బయటికి కోపం ప్రదర్శించినా ఆయన మనసు మాత్రం వెన్న అంటుంటారు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు.అయితే అలాంటి బాలకృష్ణసినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ కాలు తొక్కిందని రచ్చ రచ్చ చేశారట. మరి ఇంతకీ బాలకృష్ణ కాలు తొక్కిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే లయ. హీరోయిన్ లయ బాలకృష్ణ కాంబినేషన్లో విజయేంద్ర వర్మ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాట షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బాలకృష్ణ కాలుని గట్టిగా తొక్కేసిందట లయ.

 అయితే పొరపాటున అలా తొక్కడంతో లయ సారీ సారీ చూసుకోలేదు సార్ అని బాలకృష్ణను బతిమాడుతుందట. కానీ ఇదంతా పట్టించుకోని బాలకృష్ణ వెంటనే ప్యాకప్ చెప్పేసి నీ వల్ల నా కాలు పచ్చడి అయిపోయింది అని షూటింగ్లోనే గొడవ చేసారట.ఇక బాలకృష్ణ ప్రవర్తించిన తీరుకి హీరోయిన్ లయ భయపడి పోయి కన్నీళ్లు పెట్టుకుందట. అంతేకాదు ఆయన దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు బతిమిలాడిన కూడా ఆయన అంతే కోపంగా మాట్లాడడంతో చివరికి చేసేదేమీ లేక కన్నీళ్ళతో లయ అక్కడ కూర్చునే సరికి వెంటనే బాలకృష్ణ అక్కడికి వచ్చి ఇదంతా ఊరికే చేశానమ్మా..

నిన్ను ఆట పట్టిద్దామని అలా చేసా..నాకు నీమీద ఎలాంటి కోపం లేదు. ఏదో అలా సరదాగా చేశాను. దీని గురించి అంత సీరియస్ గా తీసుకోకు ఇక ఏడ్చింది చాలులే అని మళ్లీ లయను ఓదార్చారట. ఇక ఆ షూటింగ్ సెట్లో బాలకృష్ణ చేసిన పనికి ఒక్కసారిగా లయ షాక్ అయిపోయిందట. అంతేకాదు బాలకృష్ణ అంత కోపంగా ప్యాకప్ చెప్పారు ఏం జరుగుతుందోనని భయపడి పోయిందట. కానీ కొద్దిసేపటికి మళ్ళీ బాలకృష్ణ నార్మల్ మోడ్ కి వచ్చేసరికి లయ కూడా సైలెంట్ అయిందట.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో లయ చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: