సాధారణంగా తల్లీదండ్రులు విడిపోవడం పిల్లల కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతుంది. ప్రముఖ నటి కావేరి కపూర్ పేరెంట్స్ విడాకుల విషయంలో అస్సలు బాధ పడలేదని చెప్పుకొచ్చారు. విడాకుల వల్ల తాను సంతోశంగానే ఉన్నానని ఆమె పేర్కొన్నారు. అలా ఉండటం తర్వాత రోజుల్లో నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించిందని కావేరి కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
సిందర్ సుచిత్రా కృష్ణమూర్తి డైరెక్టర్ శేఖర్ కపూర్ కూతురు అయిన కావేరి కపూర్ బేబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ అనే సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అమ్మానాన్న విడిపోయిన సమయంలో నేను అంతగా బాధ పడలేదని వెల్లడించారు. వాళ్లు విడాకులు తీసుకున్న సమయంలో నేను సంతోషంగానే ఉన్నానని కావేరి కపూర్ వెల్లడించారు.
 
అయితే రానురాను నేను తేడా గమనించానని వాళ్ల విడాకులు నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయని ఆమె చెప్పుకొచ్చారు. నేను పెద్దయ్యే కొద్దీ మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని కావేరి కపూర్ పేర్కొన్నారు. నేను ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నానని ఇదొక ప్రక్రియలా కొనసాగుతోందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే నాకు ఓసీడీ ఉందని ఆమె వెల్లడించారు.
 
ప్రస్తుతం ఈ సమస్యల నుంచి నిదానంగా కోలుకుంటున్నానని కావేరి కపూర్ తెలిపారు. ఈ సమస్యల నుంచి పూర్తిస్థాయిలో బయటపడటానికి చాలా సమయం పడుతుందని ఆమె వెల్లడించారు. 1999 సంవత్సరంలో శేఖర్ కపూర్ సుచిత్రా కృష్ణమూర్తి వివాహం జరిగింది. ఈ దంపతులకు 2001 సంవత్సరంలో కావేరి కపూర్ జన్మించారు. 2007 సంవత్సరంలో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. కావేరి కపూర్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పిల్లలకు తల్లీదండ్రుల సపోర్ట్ ఎంతో అవసరమని వాళ్లు కలిసి ఉంటే మాత్రమే లైఫ్ సాఫీగా సాగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: