
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ కి స్నేహితులు చాలా తక్కువ మంది. అలాంటి వారిలో ఆనంద్ సాయి కూడా ఒకరు. ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ కు క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. తొలిప్రేమ సినిమా నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు తమ తమ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇక వీరిద్దరూ ఎంత ఎదిగినా తమ స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆనంద్ సాయి ఈ ఆధ్యాత్మిక యాత్రలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
" జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. అదే నాకు దొరికింది. ఎప్పటినుంచో మేము ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం ఎన్నో కలలు కన్నాము. ఈ కోరిక మమ్మల్ని మరింత దగ్గర చేసింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అది నెరవేరింది. మునుపేన్నడు లేని విధంగా దివ్య ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టాము. ఇక పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా స్నేహితుడిగా మారడం నా అదృష్టం అంటూ ఆనంద్ సాయి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.