
టాలీవుడ్‌కి చెందిన ఒక టాప్ డైరెక్టర్.. మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు చేసిన వర్కౌట్ కాలేదు. మూడు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఒక సినిమా యావరేజ్ అయితే.. ఇంకో రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు.. శ్రీనువైట్ల. శ్రీనువైట్ల పేరు చెబితే ఒకప్పుడు టాలీవుడ్‌లో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు శ్రీనువైట్ల. కామెడీ ఆధారంగా ఎన్నో సినిమాలు.. ఎందరో హీరోలతో తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. శ్రీను వైట్లా.. మెగా ఫ్యామిలీకి చెందిన మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు, వరుణ్ తేజ్‌తో మిస్టర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో బ్రూస్ లీ సినిమాలు తెరకెక్కించారు.
ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. 2005లో చిరంజీవితో అందరివాడు సినిమా తెరకెక్కించారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా చిరంజీవి స్థాయి సినిమా అయితే కాదు. జస్ట్ బిలో అవేరేజ్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో మిస్టర్ సినిమా తెరకెక్కిస్తే పెద్ద డిజాస్టర్ అయింది. ఇక శ్రీను వైట్ల అతడు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చాలా డేర్ స్టెప్ వేసి.. బ్రూస్ లీ సినిమాకు అవకాశం ఇచ్చారు.
బ్రూస్ లీ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా మెగా ఫ్యామిలీ హీరోలు మూడుసార్లు శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చిన ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా శ్రీనువైట్ల తీయలేకపోయారు. ఎందుకో గాని.. ఎందరో స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన శ్రీనువైట్ల.. మెగా ఫ్యామిలీ హీరోలకు మాత్రం ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు ఫామ్ లో లేని శ్రీను వైట్లకు మెగా ఫ్యామిలీలు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు.