- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్లో రెమ్యూనరేషన్లు .. బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హిట్లు కొట్టే దర్శకులు .. హీరోల రెమ్యూనరేషన్ చుక్కల్లో ఉంటుంది. అదే హిట్లు మీద హిట్లు పడుతుంటే కోట్ల మీద కోట్లు పెరుగుతున్నాయి. సినిమా చేసినప్పుడు నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ కేవలం ఏడు కోట్లు ... అది ఇప్పుడు అఖండ 2 సినిమాకు 38 కోట్లకు చేరిందని సమాచారం. వరుసగా హిట్లు పడటం వల్ల ఇలా మారింది. తాజాగా అఖండ 2 సినిమా బడ్జెట్ చూస్తుంటే బాలయ్య సినిమాలకు ఎప్పుడూ లిమిట్లో ఉండే బడ్జెట్ కాస్త కంట్రోల్ తప్పినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమాకు బాలయ్య 38 కోట్లు .. బోయపాటికి 35 కోట్లు ఇస్తున్నారట. ఎంత బాలయ్య - బోయపాటి సినిమా అయినా ఇప్పుడు లెక్కలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.


బాలయ్య - బోయపాటి - తమన్ - సినిమాటోగ్రాఫర్ - ఫైట్ మాస్టర్లు ఇలా అందరి రెమ్యూనరేషన్ కి 80 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుంది. భారీ యాక్షన్ సీన్లకు మరో 10 కోట్లు పెట్టాలి. మొత్తం మీద లెక్కలు వేసుకుంటే సినిమా బడ్జెట్ 180 కోట్ల వరకు అవుతుంది. ప్రింట్ పబ్లిసిటీ ఖర్చు అన్ని కలిపి 180 కోట్లు అంటే మామూలు విషయం కాదు .. అంటే 200 కోట్ల మేరకు థియేటర్ .. నాన్ ధియేటర్ మార్కెట్ చేయాలి .. అప్పుడే నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎలా లేదన్న థియేటర్ మీద బర్డెన్ రు. 100 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. 100 కోట్ల షేర్ రావాలి అంటే కనీసం 200 కోట్ల గ్రాస్ రావాలి. డాకుమహారాజు సినిమాకు 180 కోట్లు వచ్చాయి అంటే ఈ సినిమా 200 కోట్ల థియేటర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అప్పుడే అందరూ గట్టెక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: