
- స్కంధ ప్లాప్ అయినా తగ్గని డిమాండ్ . . !
- బాలయ్య కు రు. 35 కోట్లు . .
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు బోయపాటి సినిమాలు అంటే మాస్లో మంచి క్రేజ్ ఉంటుంది. బోయపాటి కెరీర్ లో ఎక్కువ హిట్ సినిమాలు .. సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా బాలయ్య - బోయపాటి కాంబినేషన్ ఉంటే సింహా - లెజెండ్ - అఖండ సినిమాలో గుర్తుకు వస్తాయి. అలాగే భద్ర - తులసి లాంటి సినిమాలు కూడా మంచి హిట్లు కొట్టాయి. అదే బోయపాటి దమ్ము - స్కంద - వినయ విధేయ రామ లాంటి ఫ్లాప్ సినిమాలు కూడా తెరకెక్కించారు. అఖండ సినిమాతో బోయపాటి దశ తిరిగింది. అఖండ సినిమా తర్వాత రామ్తో బోయపాటి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా స్కంధ ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. స్కంద పెట్టిన పెట్టుబడి వెనక్కు రాలేదు.
అయితే ఇప్పుడు బోయపాటి మరోసారి బాలయ్యతో అఖండ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే అఖండ తర్వాత స్కంధ లాంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించి కూడా ప్లాప్ ఇచ్చినా కూడా బోయపాటికి అఖండ 2 సినిమాకు రెమ్యూనరేషన్ పెరిగింది. ఈ సినిమా కోసం బోయపాటి రెమ్యూనరేషన్ 35 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. బాలయ్య రెమ్యునరేషన్ 38 కోట్లు అంటున్నారు. అంటే దాదాపు బాలయ్యతో పోలిస్తే మూడు కోట్లు తక్కువగా బోయపాటికి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇది బోయపాటి మీద ఏ స్థాయిలో నమ్మకం ఉందో చెపుతోంది.