
కొంతమంది ఇదంతా రష్మిక మందన్నా క్రేజ్ , లక్ అంటుంటే మరికొందరు మాత్రం డైరెక్టర్స్ కారణంగా కూడా ఈ సినిమా హిట్ అవుతూ ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు రష్మిక మందన్నా పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది. కాకపోతే మొదటగా యానిమల్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఆ తర్వాత పుష్ప2.. ఆ తర్వాత చావా సినిమాలో నటించి బ్యాక్ టు బ్యాక్ హ్యాత్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .
అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది హీరోయిన్ రష్మిక మందనానే. కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. యానిమల్ - పుష్ప2 - చావా ఈ మూడు మూవీల్లలో రష్మిక మందన్నాలోని కీ పాయింట్ ని జనాలు ట్రెండ్ చేస్తున్నారు . మూడు సినిమాలలో కూడా ఆమె వైఫ్ క్యారెక్టర్ లోనే నటించింది అని .. ఆ కారణంగానే ఈమెకు ఇంత పెద్ద హిట్స్ తన ఖాతాలో పడేలా ఛాన్స్ దొరికింది అని .. అదే రష్మిక మందన ఏదైనా వేరే క్యారెక్టర్ లో కనిపించి ఉంటే మాత్రం ఇలాంటి హిట్ పడి ఉండకపోవచ్చు అని చెప్పుకొస్తున్నారు . అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ భార్యగా పుష్ప సినిమాలో పుష్పరాజ్ భార్య శ్రీవల్లి క్యారెక్టర్ లో ..చావా సినిమాలో విక్కీ కౌశల్ వైఫ్ గా ఎలాంటి ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుందో రష్మిక మందన్నా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ రష్మిక మందన్నా ఖాతాలో పడబోయే హిట్టు గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు..!