పాపం .. అల్లు అర్జున్ ఏది అనుకున్న సరే అది నెగిటివ్ గా మారిపోతుంది . పుష్ప2 సినిమాతో ఆయన ఫుల్ ఇండస్ట్రీని షేక్ చేసి ఓ  రేంజ్ లో టాక్ ఆఫి ది వరల్డ్ గా మారిపోయారు . అయితే పుష్ప2 సినిమా కారణంగా ఆయన ప్రొఫెషినల్ కెరియర్ కి ఎంత ప్లస్ అయిందో పర్సనల్ లైఫ్ కి అంతే నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిందే . సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం దాని కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం ఒకరోజు జైల్లో ఉండడం ఆయన లైఫ్లో మర్చిపోలేని ఎపిసోడ్ గా మిగిలిపోయింది .


అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు హిట్ కొట్టిన సరే ఇది మాత్రం ఎప్పటికీ జనాలు గుర్తుపెట్టుకుంటారు ..ట్రోల్ చేస్తారు.  అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటించిన నటన చూసి ఈసారి నేషనల్ అవార్డు పక్క అంటూ చాలామంది తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. పక్క భాష ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడా అదే విధంగా చెప్పుకొచ్చారు . అల్లు అర్జున్ ల చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం అసలు ఏ హీరో తరం కాదు అని నో డౌట్ ఈసారి నేషనల్ అవార్డు మాత్రం అల్లు అర్జున్ కే అని బాగా గట్టిగానే చెప్పుకొచ్చారు.

 

కానీ  ఒకే ఒక్క సినిమాతో అసలు ఇండస్ట్రీ టాక్ మొత్తం మార్చేసాడు విక్కీ కౌశల్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో విక్కీ కౌశల్ తాజాగా నటించిన సినిమా "చావా". అసలు ఈ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ హిస్టరీని తిరగరాసింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటన ఓ  అద్భుతం అని అసలు అల్లు అర్జున్ - విక్కీ కౌశల్ కి పోలికే లేదు అంటున్నారు బాలీవుడ్ జనాలు .



కచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డు విక్కీ కౌశల్ కి వస్తుంది అని చీర కట్టుకొని డ్యాన్స్ చేసినంత మాత్రాన నేషనల్ అవార్డు రావు అని .. ఒక క్యారెక్టర్ లో లీనమైపోయి జీవించి నటిస్తేనే నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ పేరు పై మళ్లీ నెగిటివ్ ప్రచారం మొదలైంది . అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీనికి ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు . అల్లు అర్జున్ పాలిట శనిలా దాపరించారు కదరా అంటూ ట్రోల్ చేసే వాళ్ళని గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. నేషనల్ అవార్డు వస్తేనే ఒక యాక్టర్ నా..? రాకపోతే కాదా ..? అంటూ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: