టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఒకప్పుడు నంబర్ వన్ డైరెక్టర్ గా శంకర్ ఒక వెలుగు వెలిగారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఒకింత సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. రోబో సినిమాకు సంబంధించి నమోదైన కాపీరైట్ ఉల్లంఘనలో ఈడీ శంకర్ కు సంబంధించిన 10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఈడీ అధికారులు ఈ విధంగా చేయడం గురించి శంకర్ స్పందించారు. ఈడీ చర్యలను ఉద్దేశించి కొన్ని విషయాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకొనిరావాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. రోబో సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను ఆధారాలుగా చూపించి నా స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారని శంకర్ చెప్పుకొచ్చారు.
 
ఈ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడంతో పాటు చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. ఎంథిరన్ కాపీ రైట్ కేసుకు సంబంధించి హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలెట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని శంకర్ అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎంథిరన్ అసలైన హక్కులు తనకే ఉన్నాయంటూ అరూర్ తమిళనాథన్ పిటిషన్ ను కొట్టివేసిందని శంకర్ తెలిపారు.
 
ఈ కేసుపై ఇప్పటికే న్యాయస్థానం తీర్పు ఇచ్చినా ఎఫ్.టీ.ఐ.ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ నా ఆస్తులను అటాచ్ చేసిందని శంకర్ చెప్పుకొచ్చారు. కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని కోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ఇలా చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించిందని ఆయన తెలిపారు. శంకర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియ వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు శంకర్ తర్వాత సినిమా ఇండియన్3 పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: