బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో , నటనతోనే కాదు కాంట్రవర్సీ మాటలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమె తన స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సమయం లో ఇందిరాగాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారుm ముఖ్యంగా ఇందిరా గాంధీజీ రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశం పై ఏర్పడిన ప్రభావాలను ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రణౌత్, జయప్రకాష్ నారాయన్ పాత్రలో అనుపమ్ ఖేర్,అటల్ బిహారీ వాజ్పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే తదితరులు కీలకపాత్రలు పోషించారు.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్లో కేవలం రూ.21 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కంగనా అప్డేట్ కూడా ఇచ్చింది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా  ఎమర్జెన్సీ ఓటీటీ విడుదల తేదీని వెల్లడిస్తూ తెలిపింది. మార్చి 17వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అని స్పష్టం చేసింది.. మరి థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికపై ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే కంగనా రనౌత్ హీరోయిన్ గానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా చలామణి అవుతుంది. అంతేకాదు ఇటీవలే బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: