
అయితే ఈమె ఎక్కువగా తమిళ , మలయాళ సినిమాల్లోనే నటించిన ఈ బ్యూటీ తెలుగులో కేవలం మూడు ఉంటే మూడు సినిమాలు మాత్రమే చేసింది .. అందులో ఒక సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది .. ఇక ఈమె సినిమాల విషయం పక్కన పెడితే హీరోయిన్గా కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ అందాల బ్యూటీ .. ఇక దాంతో క్రమంగా ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఈమె ఎక్కువగా కనిపిస్తుంది .. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా ? ఇక ఆమె మరెవరో కాదు ‘వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచుకున్న మంజిమా మోహన్ .. ఇంతకీ అదేనండి నాగ చైతన్య హీరోగా వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో లీల పాత్రలో మెరిసిన హీరోయిన్ .. ఇది ఆమె చిన్నప్పటి ఫోటో. సాహసం శ్వాసగా సాగిపో సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు సినిమాలో కూడా మంజిమా మోహన్ నటించింది ..
ఇక ఈ సినిమాలో ఈమె నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది .. ఆ తర్వాత మరి తెలుగు సినిమాల్లో ఈమె నటించలేదు . అయితే తమిళ్ , మలయాళ సినిమాలతో మాత్రం బిజీగా గడిపింది .. అయితే 2022 లో ఈ ముద్దుగుమ్మ ప్రముఖ సీనియర్ నటుడు కార్తీక్ కొడుకు హీరో గౌతం కార్తీక్ ను పెళ్లి చేసుకుంది .. అయితే వీరిద్దరూ గతంలో కలిసి ఓ సినిమాలో నటించే సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు .. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఒక్కట అయ్యారు. మంజిమా చివరిగా 2023లో బూ అనే ఒక సినిమా నటించింది .. ఆ తర్వాత ఈమె మరి సినిమాలోను నటించలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా కనిపిస్తుంది. భర్త కార్తీక్ మాత్రం పలు సినిమాలు నటిస్తున్నారు .. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీక్.