
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు , ఓజీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే గాని ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఫోకస్ చేసే సమయం ఉండదన్న విషయం తెలిసింది .. పవన్ పిలిచి షూటింగ్ కు కాల్ షీట్లు ఇచ్చేవరకు హరీష్ ఏం చేస్తారు అనేది అందర్నీ ఊరిస్తున్న ప్రశ్న .. మంచి కాంబినేషన్ కుదిరిందని రవితేజతో హరీష్ మిస్టర్ బచ్చన్ చేశారు .. ప్రమోషన్స్ చేసిన తీరు హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ ఈ కాంబో మీద ఉన్న క్రేజీతో సినిమాకు రిలీజ్ కు ముందు పాజిటివ్ టాక్ వచ్చింది .. కానీ రిలీజ్ తర్వాత దాని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది టీం . అయితే ఎప్పుడు హరీష్ శంకర్ ఏం చేయబోతున్నార ?
ఈ రీసెంట్ టైమ్స్ బాలయ్యకు ఒక కథ చెప్పారని టాక్ కూడా వచ్చింది .. ఆ తర్వాత లైన్ అప్లో రామ్ సినిమా ఉందన్నారు .. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరితో హరీష్ సినిమా చేయబోతున్నాడా ? మరేదైనా వేరే ప్లానింగ్ లో ఉన్నారా .. వీరిలో ఎవరితో సినిమా చేసిన కచ్చితంగా పర్ఫెక్ట్ సినిమా ఒకటి పడాలి ఈ దర్శకుడికి .. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు మనసులో ఏముంది ? ఏ హీరోతో సినిమా ప్లాన్ చేశారు ? లేక డిప్యూటీ సీఎం డేట్ల కోసం ఎదురు చూస్తారా ? హరి శంకర్ నెక్స్ట్ ప్లానింగ్ గురించి కాలమే సమాధానం చెప్పాలి.