ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి హీరోలు సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు .. అంతేకాకుండా ఈ హీరోల లైన్ ఆఫ్ విషయంలోను ఓ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తుంది ... ప్రెసెంట్ ఫామ్ లో ఉన్న ముగ్గురు హీరోలు మాత్రమే కాదు త్వరలో డెబ్యూకి రెడీ అవుతున్న నందమూరి వారసుడు సినిమా విషయంలోని ఇదే సిమిలారిటీ కనిపిస్తుంది .. అది ఏంటి అనుకుంటున్నారా .. అయితే ఈ స్టోరీలో తెలుసుకోండి. ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ తో బాలయ్య ఫుల్ హ్యాపీగా ఉన్నారు .. ప్రస్తుతం అఖండ 2  షూటింగ్లో బిజీగా ఉన్నారు బాలయ్య .. ఇప్పటికీ అఖండ మొదటి భాగం సూపర్ హిట్ అవటంతో సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తీసుకొస్తున్నారు .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది.


ఇక ఎన్టీఆర్ కూడా సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు .. ప్రస్తుతం వార్ 2షూటింగ్లో ఉన్నాడు తారక్ ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ తో కలిసి నటిస్తున్నారు .. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమాతో పాటు దేవర 2 వర్క్ కూడా మొదలుపెడతారు .. దేవర సక్సెస్ తరువాత సీక్వెల్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర మేకర్స్ . మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా ప్రజెంట్  ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నరు .. ఈ నందమూరి హీరో . తర్వాత బింసారాకు ప్రీక్వాల్ గా రాబోతున్న బింబిసారా 2 లో నటించేందుకు రెడీ అవుతున్నారు .. ఈ సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది.


అతి త్వరలోనే వెండి తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న మరో నందమూరి హీరో మోక్షజ్ఞ కూడా సీక్వెల్‌తోనే అడుగుపెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది .. బాలకృష్ణ కెరియర్ లో క్లాసికల్ సినిమాగా నిలిచిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్‌గా రాబోతున్న ఆదిత్య 999 మ్యాక్స్ తో మోక్షజ్ఞ పాన్‌ ఇండియా స్థాయిలో అడుగుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా ఈ నందమూరి హీరోలంతా వరుస సీక్వెల్స్ మీద దృష్టి పెట్టడం ఇప్పుడు అందరిలో కాస్త ఆసక్తిగా మారిందని అభిమానులు అంటున్నారు .. అయితే ఈ నాలుగు సీక్వెల్స్ మీద ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పుడు ఈ సినిమాలు చూడాలంటే మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: